Advertisement

  • విండీస్‌ హెడ్‌ కోచ్‌ సిమన్స్‌ "సెల్ఫ్‌ ఐసోలేషన్‌"

విండీస్‌ హెడ్‌ కోచ్‌ సిమన్స్‌ "సెల్ఫ్‌ ఐసోలేషన్‌"

By: chandrasekar Tue, 30 June 2020 10:51 AM

విండీస్‌ హెడ్‌ కోచ్‌ సిమన్స్‌ "సెల్ఫ్‌ ఐసోలేషన్‌"


వెస్టిండీస్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. రెండు రోజుల క్రితం అంత్యక్రియలకు హాజరైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సిమన్స్‌ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌ జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు జట్టు సన్నాహాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని ఫాస్ట్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ తెలిపాడు.

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇంగ్లీష్‌ జట్టుతో సిరీస్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే వెస్టిండీస్‌ క్రికెట్ టీమ్‌ ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం అంత్యక్రియలకు హాజరైనప్పటి నుంచి తాను బసచేస్తున్న ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ హోటల్‌లోనే సిమన్స్‌ నిర్బంధంలో ఉంటున్నాడు. వచ్చే గురువారం విండీస్‌ జట్టుతో అతడు కలవాలంటే కనీసం రెండు కరోనా టెస్టులకు హాజరుకావాల్సి ఉంటుంది.

రెండింటిలోనూ కరోనా నెగెటివ్‌గా వస్తేనే అతడు జట్టుతో కలిసేందుకు అనుమతి లభిస్తుంది. ఐతే సిమన్స్‌ మాకు దూరంగా ఉంటున్నప్పటికీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ సన్నాహాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిగతా కోచింగ్‌ సహాయ సిబ్బంది మద్దతుగా ఉన్నారని జోసెఫ్‌ తెలిపారు.

Tags :
|
|
|

Advertisement