Advertisement

  • ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజధానులపై త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్ బిల్లుపై ఆమోదం తెలపొచ్చు?

ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజధానులపై త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్ బిల్లుపై ఆమోదం తెలపొచ్చు?

By: chandrasekar Thu, 30 July 2020 6:54 PM

ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజధానులపై త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్ బిల్లుపై ఆమోదం తెలపొచ్చు?


ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజధానులపై త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్ బిల్లుపై ఆమోదం తెలపొచ్చునని వైసీపీ శ్రేణులు ప్ర‌చారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్ వ‌ద్ద‌కు చేరిన మూడు రాజ‌ధానుల బిల్లుపై ఇంకా దాగుడుమూత‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై గవర్నర్ హరిచందన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌న వ‌ద్ద‌కు పంపించిన బిల్లుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్న‌ దానిపై గ‌వ‌ర్న‌ర్ కేంద్రంలో పెద్ద‌ల‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు బిల్లును పూర్తిగా ప‌రిశీలించి న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు తీసుకున్న‌ట్లు కూడా సమాచారం.

ప్రస్తుతం గ‌వ‌ర్న‌ర్ ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌దానిపై అటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ ఇటు ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెల‌కుంది. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం తాము పంపించిన బిల్లు గురించి గ‌వ‌ర్న‌ర్ ను వివ‌రించ‌డానికి ఒక కీల‌క మంత్రిని గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపించిన‌ట్లు స‌మ‌చారం. అయితే స‌ద‌రు మంత్రి బిల్లు గురించి అందులో ఉన్న ముఖ్య అంశాలు గురించి గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రిస్తున్న‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ బిల్లు ప‌ట్ల సానుకూలంగా స్పందించార‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌చారం చేసుకుంటున్నారు.

మ‌రో రెండు మూడు రోజ‌ల్లో ఈ బిల్లుపై తన నిర్ణ‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టిస్తార‌నే ఆశాభావాన్ని ప్ర‌భుత్వం వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తోన్నాయి. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోబోమ‌ని ప‌దే ప‌దే చెబుతోంది. దీంతోపాటు శాస‌న స‌భ‌లో ఈ బిల్లుకు ఆమోదం పొందిన త‌రువాత ఈ బిల్లును ఆపే అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉంటే సెలక్ట్ క‌మిటీకి పంపిస్తామ‌ని మండ‌లి చెర్మ‌న్ తెలిపిన త‌రువాత బిల్లు ఇంకా మండ‌లి ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈ నేప‌థ్యంలో బిల్లును మండ‌లి తిర‌ష్క‌రించ‌డం ఎలా అవుతుంద‌ని టీడీపీ కొన్ని సాంకేతికప‌ర‌మైన వాద‌న‌లు తెర‌పైకి తీసుకోస్తోంది. దీంతోపాటు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం న‌డుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఈ విధంగా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌నేది మ‌రో వాదన. అయితే ఈ వాదన‌ల‌కు అధికార‌పార్టీ నేత‌లు కూడా గ‌ట్టిగా కౌంట‌ర్ ఇస్తోన్నారు. త‌మ ప్ర‌భుత్వం ఎక్క‌డా మూడు రాజ‌ధానులు అని బిల్లులో చెప్ప‌లేదు. అధికార వికేంద్రీక‌ర‌ణ అని మాత్ర‌మే చెబుతుంది. అలాంట‌ప్పుడు ప్ర‌తిప‌క్ష‌పార్టీ చేస్తోన్న, చూపిస్తోన్న సాంకేత‌క అంశాలు త‌మ‌కు వ‌ర్తించ‌వు అని చెబుతున్నారు.

ఇప్ప‌టికే బీజేపీ కీల‌క నేత‌లు రామ్ మాధవ్ వంటి వాళ్లు కూడా రాజ‌ధాని అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం ఉండ‌ద‌ని ప‌లు సంద‌ర్భ‌ాల్లో తెలిపారు. తాజాగా క‌న్నా వ్య‌వ‌హారం కూడా ఇందుకు ఉదాహర‌ణగా చెబుతున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. రాష్ట్ర శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుల‌ను కేంద్రం అపేయ‌డం వంటి పరిణామాలు బ‌హుశా జ‌ర‌గ‌వు. జ‌ర‌గ‌కూడ‌దు కూడా.

మూడు రాజ‌ధానుల బిల్లుపై ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేకంగా ఏమైనా అడ్డ‌కులు పెడ‌తారంటే అది పూర్తి గా భ్ర‌మే అని నా అభిప్రాయం. శాస‌నస‌భ ప్ర‌సంగంలో కూడా గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల గురించి ప్ర‌స్తావించారు. అలాటప్పుడు ప్ర‌త్యేకించి ఇప్పుడు అడ్డ‌కులు పెడ‌తార‌ని నేన‌నుకోను. అందుకే త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్ ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతార‌ని నేను భావిస్తోన్నా. అని న్యూస్ 18 కి తెలిపారు ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌భాక‌ర్ రావు.

Tags :
|

Advertisement