Advertisement

  • అనారోగ్య కార‌ణాల రీత్యా పుతిన్ అధ్య‌క్ష ప‌ద‌విని వీడ‌నున్నారా..?

అనారోగ్య కార‌ణాల రీత్యా పుతిన్ అధ్య‌క్ష ప‌ద‌విని వీడ‌నున్నారా..?

By: chandrasekar Sat, 07 Nov 2020 12:02 PM

అనారోగ్య కార‌ణాల రీత్యా పుతిన్ అధ్య‌క్ష ప‌ద‌విని వీడ‌నున్నారా..?


ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్కిన్స‌న్స్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న కారణంగా ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్నారా..? ఇటీవ‌ల న్యూయార్క్ పోస్ట్‌లో ప్ర‌చురిత‌మైన ఒక నివేదిక ప్ర‌కారం.. అవున‌నే స‌మాధానం వ‌స్తున్న‌ది. అనారోగ్య కార‌ణాల రీత్యా పుతిన్ అధ్య‌క్ష ప‌ద‌విని వీడ‌నున్నార‌ని ఆ నివేదికలో ర‌ష్యాకు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు వాలెరీ సొలోవెయ్ తెలిపారు.

వ్లాదిమిర్ పుతిన్ పార్కిన్స‌న్స్ వ్యాధితో బాధ‌ప‌డుతుండవ‌చ్చున‌ని, ఇటీవ‌ల ఆయ‌న‌లో ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని వాలెరీ సొలోవెయ్ త‌న క‌థ‌నంలో పేర్కొన్నారు. అనారోగ్యం రీత్యా ప‌ద‌వి నుంచి వైదొలిగి విశ్రాంతి తీసుకొమ్మ‌ని కుటుంబ‌స‌భ్యులు 68 ఏండ్ల‌ పుతిన్‌పై ఒత్తిడి చేస్తున్నార‌ని సొలోవెయ్ తెలిపారు. త‌న‌ 37 ఏండ్ల గ‌ర్ల్ ఫ్రెండ్ అలినా క‌బ‌యెవా, ఇద్ద‌రు కుమార్తెల ఒత్తిడి కార‌ణంగా పుతిన్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు అన్నారు. ఈ విష‌యాన్ని పుతిన్ జ‌న‌వ‌రిలో ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాల‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ది యూఎస్ స‌న్ ప‌త్రిక కూడా పుతిన్ అనారోగ్యం విష‌యాన్ని ప్ర‌స్తావించింది. పుతిన్ ఇటీవ‌లి పుటేజ్‌ను అధ్య‌య‌నం చేసిన ప‌రిశీల‌కులు ఆయ‌న త‌న కాళ్ల‌ను చాలా క‌ష్టంగా క‌దుపుతున్న‌ట్లు గుర్తించార‌ని ఆ ప‌త్రిక తెలిపింది. కుర్చీ ఆర్మ్ రెస్ట్‌ను ప‌ట్టుకుంటే ఆయ‌న చేతులు నొప్పిపెడుతున్న‌ట్లు తెలుస్తున్న‌ద‌ని, చివ‌రికి పెన్ను, టీ క‌ప్పు ప‌ట్టుకోవాల‌న్నా పుతిన్ నొప్పిని ఫీల‌వుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతున్నద‌ని ప‌రిశీల‌కులు చెప్పిన‌ట్లు ది యూఎస్ స‌న్ తెలిపింది.

ఇప్ప‌టికే ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న ట్రంప్ త్వ‌ర‌లో ర‌ష్యాకు కొత్త ప్ర‌ధానిని నియ‌మించ‌బోతున్నార‌ని, ఆ కొత్త‌గా నియామ‌కం కాబోయే వ్య‌క్తే పుతిన్ త‌ర్వాత ఆ దేశ అధ్య‌క్షుడు కానున్నార‌ని న్యూయార్క్ పోస్ట్ ప్ర‌చురించింది. ర‌ష్యా అధ్య‌క్ష కార్యాల‌య సిబ్బంది మాత్రం ఈ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. అవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలేనని అంటున్నారు. కాగా, ర‌ష్యా మాజీ అధ్య‌క్షులకు జీవిత‌కాలంపాటు క్రిమిన‌ల్ ప్రాసిక్యూష‌న్ నుంచి ఇమ్యూనిటీ క‌ల్పించే బిల్లుకు అక్క‌డి ఎంపీలు ఆమోద‌ముద్ర వేయ‌బోతున్న త‌రుణంలో ఈ ఊహాగానాలు వెలువ‌డటం గ‌మ‌నార్హం.

Tags :
|
|
|

Advertisement