Advertisement

  • శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఆందోళన కలిగిస్తున్న వన్యప్రాణులు

శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఆందోళన కలిగిస్తున్న వన్యప్రాణులు

By: chandrasekar Wed, 26 Aug 2020 12:19 PM

శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఆందోళన కలిగిస్తున్న వన్యప్రాణులు


కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపు మూడు నెలల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ తగ్గిపోవడంతో వన్యప్రాణులు యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి. తిరుమలలో తరచూ వన్యప్రాణుల సంచారం ఎక్కువయ్యింది. దీంతో ఇప్పుడిప్పుడే శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఆందోళన చెందుతున్నారు.

తిరుమల ఆలయానికి వెళ్లే మార్గంలో చిరుత పులులు, జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు తరచూ కనిపస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఓ చిరుత రోడ్డుపై వెళ్లే వాహనదారులపై దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మంగళవారం సాయంత్రం తిరుమల ఔటర్ రింగ్ రోడ్డుపై ఎలుగుబంటి దర్శనమిచ్చింది.

రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజిలెన్స్ సిబ్బందికి ఎలుగుబంటి తారసపడింది. అది తమ వాహనం వద్దకే రావడంతో వాహనాన్ని ఆపి దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేసారు. అనంతరం వాహనాన్ని నిదానంగా దాని వెంటే నడుపుతూ అడవిలోకి తరిమేశారు.

Tags :

Advertisement