Advertisement

  • డ్రగ్స్​ తీసుకోవాలంటూ భార్యపై ఒత్తిడి... వీడియో వైరల్...!

డ్రగ్స్​ తీసుకోవాలంటూ భార్యపై ఒత్తిడి... వీడియో వైరల్...!

By: Anji Thu, 22 Oct 2020 8:32 PM

డ్రగ్స్​ తీసుకోవాలంటూ భార్యపై ఒత్తిడి... వీడియో వైరల్...!

బెంగళూరు కోరమంగళకు చెందిన ఓ వివాహిత తన భర్త రోహిత్​ పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. రోజు మాదకద్రవ్యాలు సేవించి వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

రోహిత్​కు ముందునుంచే డగ్స్​ తీసుకునే అలవాటు ఉన్నా.. అతడి తల్లిదండ్రులు కనీసం వారించలేదని తెలిపింది. ఇప్పటికీ ఇంట్లో కొకైన్​ ఉందని, బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి తనను బలవంతం చేస్తున్నట్లు పోలీసులకు చెప్పింది. తాను డ్రగ్స్​ తీసుకోను అని చెప్తున్నాా బలవంతపెడుతూ.. వీడియోలు తీసేవాడని వాపోయింది.

Tags :

Advertisement