Advertisement

  • గాయం నుంచి కోలుకున్న సాహా.... ఆస్ట్రేలియా సిరీస్ ముందు టీమిండియా కు గుడ్ న్యూస్

గాయం నుంచి కోలుకున్న సాహా.... ఆస్ట్రేలియా సిరీస్ ముందు టీమిండియా కు గుడ్ న్యూస్

By: Sankar Thu, 19 Nov 2020 07:15 AM

గాయం నుంచి కోలుకున్న సాహా.... ఆస్ట్రేలియా సిరీస్ ముందు టీమిండియా కు గుడ్ న్యూస్


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియాకి ఉత్సాహానిచ్చే వార్త. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న వికెట్ కీపర్ సాహా.. ఎట్టకేలకి ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా ఆడిన సాహా.. రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాది ఆ జట్టుని గెలిపించిన విషయం తెలిసిందే మొత్తంగా.. ఐపీఎల్ 2020 సీజన్‌లో 4 మ్యాచ్‌లాడిన ఈ వికెట్ కీపర్ 139.86 స్ట్రైక్‌రేట్‌తో 214 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం.

తొడ కండరాల గాయంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌కి దూరంగా ఉన్న సాహా.. ఆస్ట్రేలియాతో డిసెంబరు 17 నుంచి ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అయితే.. సిరీస్ ఆరంభానికి ముందే అతను ఫిట్‌నెస్ సాధించడంపై ఇటీవల మాజీ క్రికెటర్లు సందేహం వ్యక్తం చేయగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తాజాగా అతను నెట్స్‌లో ప్రాక్టీస్‌ని ప్రారంభించాడు. దాంతో.. రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన రిషబ్ పంత్ సిరీస్‌లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement