Advertisement

చెన్నై సూపర్ కింగ్స్‌లో రైనా స్థానంలో ఎవరు?

By: Dimple Mon, 31 Aug 2020 11:42 PM

చెన్నై సూపర్ కింగ్స్‌లో రైనా స్థానంలో ఎవరు?

దుబాయ్‌, అబుదాబిలో బసచేస్తున్న ఐపీఎల్‌ జట్లు ప్రాక్టీసుతో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో చెన్నై శిబిరంలో రైనా దూరం కావడం చర్చనీయాంశమైంది. కోవిడ్‌ పాజిటివ్ కారణమనీ... వసతి కేటాయింపుల్లో వివక్షత చూపారని... సొంత మేనమామపైదాడి అంశం కారణాలు ప్రాథమికంగా ప్రస్తవనకొచ్చాయి. అయితే రైనా దుబాయినుంచి తిరుగు ప్రయాణానికి బలమైన కారణం వేరే అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నాడని ఆ జట్టు పేర్కొన్నా తన నిర్ణయం వెనుక బయటకు చెప్పని కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా తప్పుకోవడంతో ఆ స్థానాన్ని యువ క్రికెటర్‌ సామ్‌ కరన్‌తో భర్తీ చేయాలని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సూచించాడు.‌ పొట్టి క్రికెట్‌లో ఏ జట్టైనా సహజంగా కుడిచేతి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడానికి లెగ్‌ స్పిన్నర్లను తీసుకుంటామని, ఈ క్రమంలోనే లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ కూడా లెగ్‌స్పిన్నర్లతో రాజీ పడతారని చెప్పాడు. రైనా లాంటి అనుభవం కలిగిన బ్యాట్స్‌మన్‌ లేకపోవడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇబ్బందికరమే అయినా, అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో అవకాశం ఉందన్నాడు.

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ను ఈసారి సీఎస్కే తీసుకున్నందున అతడిని మూడో స్థానంలో ఆడించాలని సూచించాడు.. అతడు కూడా ఎడమచేతి వాటంతోనే అటు బంతితో, ఇటు బ్యాటింగ్‌తో రాణించగలడని వివరించాడు. ఈ క్రమంలోనే అతడు రైనా స్థానంలో ఆడి, ఆ జట్టుకు అవసరమైన పరుగులు చేస్తాడని అభిప్రాయం వ్యక్తంచేశాడు. అలాగే ధోనీ కూడా ఎన్నో ఏళ్లుగా నాణ్యమైన లెఫ్ట్‌ఆర్మ్ పేసర్‌ను తీసుకోడానికి ఇష్టపడటం వల్ల అలా కూడా కలిసివస్తుందని శివరామకృష్ణన్‌ మనసులో మాట బయటపెట్టాడు.
దీన్ని బట్టి రైనా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు పూర్తిగా దూరమైనట్టేనని తెలుస్తోంది.

Tags :
|

Advertisement