Advertisement

  • కెసిఆర్‌ తర్వాత తెరాస కారును నడిపించే నాయకుడెవరు

కెసిఆర్‌ తర్వాత తెరాస కారును నడిపించే నాయకుడెవరు

By: Dimple Wed, 09 Sept 2020 08:36 AM

కెసిఆర్‌ తర్వాత తెరాస కారును నడిపించే నాయకుడెవరు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, 2024 ఎన్నికల నాటికి సీఎం బాధ్యతల నుంచి తప్పకుంటారని ఓ బలమైన వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వారసుడు ఎవరు అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం మొదలైననాటి నుంచి ఆయన మేనళ్లుడు, ప్రస్తుత మంత్రి హరీష్‌తో పాటు కుమారుడు, మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాకరామారావు కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే కేటీఆర్‌ కంటే హరీష్‌ ఉద్యమం తొలినాళ్ల నుంచీ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు. అయినప్పటికీ ‍ప్రస్తుతం పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా హరీష్‌ కంటే కేటీఆర్‌దే పై చేయి అని రాజీకీయ విశ్లేషకుల మాట. హరీష్‌ ఎంత సీనియర్‌ అయిన్పటికీ కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఆయన తరువాత పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలను సైతం కేటీఆర్‌యే అందుకుంటారని అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్‌ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌ అనతికాలంలోనే రాజకీయాలను వంటపట్టించుకున్నారు. పాలనలో, వ్యూహ రచనలోనైనా తనదైన శైలిని అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లితే రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న రాజకీయ వర్గల్లో ఉత్నన్నమవుతోంది. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి కేటీఆర్‌ పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే కేసీఆర్‌ విజయం వెనుక ఆయన తనయుడు పాత్ర ఎంతో ఉంది. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించి.. తెలంగాణ వాదాన్ని ముందుండి నడిపించారు.

2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. సుమారు దశాబ్ధాల కాలం క్రితం ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితంలో ఓటమిని ఏనాడు రుచిచూడని నేతగా గుర్తింపుపొందారు. ఈ క్రమంలోనే తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి... ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖలకు కొత్త రూపులను దిద్దుతున్నారు.

Tags :
|
|
|

Advertisement