Advertisement

  • వైరస్ ఇంకా ప్రజలకు నెంబర్ వన్ శత్రువు లాగే ఉంది ..డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్

వైరస్ ఇంకా ప్రజలకు నెంబర్ వన్ శత్రువు లాగే ఉంది ..డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్

By: Sankar Tue, 14 July 2020 12:04 PM

వైరస్ ఇంకా ప్రజలకు నెంబర్ వన్ శత్రువు లాగే ఉంది ..డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్



కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు అనేక చర్యలు చేస్తున్నప్పటికీ కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి .అయితే ప్రపంచ దేశాలు సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవడం లేదు అని అన్నారు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్..అనుస‌రించాల్సిన చ‌ర్య‌ల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే కేసులు పెరుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. దేశాధినేత‌ల నుంచి వ‌స్తున్న మిశ్ర‌మ సందేశాల వ‌ల్ల మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌లో ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లిన‌ట్లు టెడ్రోస్ అభిప్రాయ‌ప‌డ్డారు. వైర‌స్ ఇంకా ప్ర‌జ‌ల‌కు నెంబ‌ర్ వ‌న్ శ‌త్రువుగానే ఉన్న‌ద‌ని, కానీ కొన్ని ప్ర‌భుత్వాల‌, ప్ర‌జ‌ల చ‌ర్య‌లు ఆ స్థాయిలో లేవ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సామాజిక దూరాన్ని పాటించ‌డం, చేతులు క‌డుక్కోవ‌డం, మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం లాంటి అంశాల‌ను ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని డాక్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. ఇలా చేయ‌క‌పోతే ఇప్పట్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డం సాధ్యం కాదు అని ఆయ‌న హెచ్చ‌రించారు. ప్రాథ‌మిక సూత్రాల‌ను పాటించుకుంటే, అప్పుడు మ‌హ‌మ్మారి ఎక్క‌డికీ వెళ్ల‌దు అని, అది మ‌రింత అధ్వాన్న‌మైన ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంద‌ని ఆయ‌న అన్నారు..


Tags :
|
|
|
|
|

Advertisement