Advertisement

  • కరోనా రోగులకు స్టెరాయిడ్లతో చికిత్స... డబ్ల్యూహెచ్వో

కరోనా రోగులకు స్టెరాయిడ్లతో చికిత్స... డబ్ల్యూహెచ్వో

By: chandrasekar Thu, 03 Sept 2020 6:58 PM

కరోనా రోగులకు స్టెరాయిడ్లతో చికిత్స... డబ్ల్యూహెచ్వో


కరోనా వైరస్ బారిన పడి పరిస్థితి విషమించిన వారికి స్టెరాయిడ్లు ప్రాణాధార ఔషధంగా మారుతున్నాయని పరిశోధకులు కనుగున్నారు. కార్టికోస్టెరాయిడ్ డ్రగ్స్‌ను ప్రయోగాత్మకంగా పరిస్థితి విషమంగా ఉన్న కరోనా పేషెంట్లకు ఇచ్చినపుడు మరణించే ముప్పు 20 శాతం తగ్గిందని గుర్తించారు. ఏడు అంతర్జాతీయ ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో కరోనా బారిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా బాధితులకు స్టెరాయిడ్లతో చికిత్స అందించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న వారికి మాత్రం స్టెరాయిడ్లు వాడకూడదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. శరీర రోగ నిరోధక శక్తిని తగ్గించడం కోసం.. వాపు, నొప్పి, మంటను తగ్గించడం కోసం.. డెక్సామెథసోన్, హైడ్రోకార్టిసోన్, మెథైల్‌ప్రెడ్రిసోలోన్ లాంటి స్టెరాయిడ్లను డాక్టర్లు తరచుగా సూచిస్తుంటారు.

వైరస్ కారణంగా కంటే ఇన్ఫెక్షన్ పట్ల శరీరం అతిగా స్పందించడం వల్ల చాలా మంది కరోనా పేషెంట్లు చనిపోతున్నారు. కార్టికోస్టెరాయిడ్ల వాడకం, మరణాల రేటు తగ్గడానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న 1703 మంది పేషెంట్లపై ఏడు ర్యాండమ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. స్టెరాయిడ్లు వారిన వారిలో బతికే అవకాశాలు పెరిగాయని ఈ పరిశోధనలో తేలింది. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడిన పేషెంట్లకు డెక్సామెథసోన్‌ ఇవ్వడం వల్ల బతికే అవకాశాలు పెరుగుతున్నాయని.. జూన్ నెలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. చౌకగా లభ్యమయ్యే ఈ స్టెరాయిడ్లు పేషెంట్ల ప్రాణాలను నిలబెడతాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న వారికి తక్కువ మోతాదులో ఇస్తే ఫలితం ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Tags :
|
|

Advertisement