Advertisement

  • కరోనా అత్యవసర కమిటీ సమావేశం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు

కరోనా అత్యవసర కమిటీ సమావేశం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు

By: chandrasekar Tue, 04 Aug 2020 09:19 AM

కరోనా అత్యవసర కమిటీ సమావేశం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు


ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడవద్దని, మహమ్మారి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి వ్యాక్సిన్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ‌ హెచ్చరించింది. సమర్థవంతమైన వ్యాక్సిన్ల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, కొత్త రకం కరోనా వైరస్‌కు సిల్వర్ బుల్లెట్ సమాధానం ఎప్పుడూ ఉండదని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ సోమవారం విర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా‌కు సమర్థవంతమై వ్యాక్సిన్ లేదు. భవిష్యత్తులోనూ రాబోదని ఉద్ఘాటించారు. డబ్ల్యూహెచ్ఓ కరోనా అత్యవసర కమిటీ సమావేశం సందర్భంగా టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

లక్షల్లో మరణాలకు, ఆర్థిక సంక్షోభానికి కారణమైన మహమ్మారిని అణిచివేసి, సాధారణ జీవితాన్ని ప్రారంభించడానికి పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం వంటి తెలిసిన ప్రాథమికాలను పాటించడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వాలు, పౌరులను ఆయన కోరారు. కరోనా సంక్రమణ నిరోధించడంలో సహాయపడే ప్రభావవంతమైన వ్యాక్సిన్లు రావాలని మనమందరం ఆశిస్తున్నాం. అయితే, ప్రస్తుతానికి దీనికి సమాధానం లేదు, ఎప్పుడూ ఉండకపోవచ్చు అన్ని అన్నారు. ప్రస్తుతానికి, వ్యాప్తిని అరికట్టడం, ప్రజారోగ్యం, వ్యాధి నియంత్రణ ప్రాథమిక అంశాల కిందకు వస్తుంది. ఇవన్నీ చేయండి’ అని ఆయన కోరారు.

ప్రస్తుతం ప్రపంచంలో నెలకున్న పరిస్థితులపై సమీక్షించడానికి ఈ కమిటీ సమావేశమయ్యింది. కమిటీ సలహా మేరకు మహమ్మారి వ్యాప్తి గురించి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్‌ను ఏర్పాటు చేశామన్నారు. జనవరి 30 నాటికి చైనా వెలుపల కేవలం 100 కేసులే ఉన్నాయని, మరణాలు చోటుచేసుకోలేదన్నారు. మూడు నెలల కిందట కమిటీ సమావేశమయ్యే నాటికి ప్రపంచంలో 30 లక్షలకుపైగా కేసులు, 2 లక్షలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అప్పటి నుంచి మహమ్మారి ఉద్ధృతి పెరుగుతూ ఉంది. మూడు నెలల్లోనే ఐదు రెట్లు మేర పాజిటివ్ కేసులు పెరగ్గా, మరణాలు మూడు రెట్లకుపైగా (6.8 లక్షలు) చేరుకున్నాయి.

కరోనా ఆరోగ్యంతోపాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నష్టాన్ని మిగిల్చింది. కరోనా ప్రభావంతోపాటు ఇతర వ్యాధుల సేవలకు అంతరాయం కలిగి ఉన్న ఆరోగ్య ప్రభావాన్ని కమిటీ గుర్తించింది. రోగనిరోధకత స్థాయి తగ్గడం, క్యాన్సర్ స్క్రీనింగ్, సంరక్షణ, మానసిక ఆరోగ్య సేవలను తీవ్రంగ ప్రభావితం చేసింది. మే-జులై మధ్య 103 దేశాల నుంచి వచ్చిన ప్రతిస్పందనల సర్వేలో 67 శాతం కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు కమిటీ నివేదిక పేర్కొంది. సగం కంటే ఎక్కువ దేశాలు ప్రసూతి సంరక్షణ సేవల్లో అంతరాయం, మూడో వంతు దేశాలు ప్రసవ సేవలకు విఘాతం కలిగించాయి.

Tags :
|

Advertisement