Advertisement

  • రష్యా కరోనా వాక్సిన్ కు షాకిచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్

రష్యా కరోనా వాక్సిన్ కు షాకిచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్

By: Sankar Fri, 14 Aug 2020 12:15 PM

రష్యా కరోనా వాక్సిన్ కు షాకిచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్


కరోనా కు మందు కనిపెట్టామని ప్రకటించిన రష్యా కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ షాకిచ్చింది .. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా ప్రయోగ దశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్లు్యహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై తగినంత సమాచారం లేదు కాబట్టి దాని సమర్థతపై నిర్ణయానికి రాలేమని డబ్ల్యూహెచ్‌‌వో సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ బ్రూస్‌ అయల్వార్డ్‌ అన్నారు. టీకా ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

కాగా రష్యా అభివృద్ధి చేసిన టీకాను ఎక్కువ మందిపై పరీక్షించకపోతే దాని సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యురల్‌ బయాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రజలు అదృష్టవంతులైతే టీకా పనిచేస్తుందేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు తగినన్ని ప్రయోగాలు చేయలేదు. ఎక్కువ మందిలో టీకా ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మూడో దశ మానవ ప్రయోగాలు అవసరం’అని చెప్పారు.

Tags :
|
|
|

Advertisement