Advertisement

  • కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

By: Sankar Fri, 11 Sept 2020 04:59 AM

కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంది..ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టడమే పనిగా పెట్టుకున్నాయి..ఒకదానికొకటి పోటీ పడుతూ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి..అయితే ఈ వ్యాక్సిన్ ప్రయోగాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది..

డబ్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ దీనిపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 వ్యాక్సిన్లు అభివృద్ధి దిశలో ఉన్నాయని తెలిపారు. ఇక, వీటిలో 35 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని వెల్లడించారు. డెక్సామెథాసోన్‌ను కూడా ప్రస్తావించారు టెడ్రోస్... కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న రోగులపై, ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన రోగులపై కూడా డెక్సామెథాసోన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. చరిత్రలో ఏ వ్యాధి కూడా కోవిడ్ తరహాలో వేగంగా విస్తరించలేదని తమ పరిశోధనలు తేలిందన్నారు.

కాగా, లో-కాస్ట్ స్టెరాయిడ్ డ్రగ్ డెక్సామెథాసోన్‌ను కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స చేసేందుకు మిథైల్‌ప్రెడ్నిసోలోన్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది. కోవిడ్ రోగులకు డెక్సామెథాసోన్‌ పరమ ఔషధంగా పనికి వస్తుందని, వారి ప్రాణాలు కాపాడడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే..

Tags :
|

Advertisement