Advertisement

  • 'ధారావి'పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు... కరోనా నియంత్రణకు ఆ మురికివాడ ఒక ఆదర్శం ..

'ధారావి'పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు... కరోనా నియంత్రణకు ఆ మురికివాడ ఒక ఆదర్శం ..

By: chandrasekar Tue, 18 Aug 2020 9:16 PM

'ధారావి'పై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు... కరోనా నియంత్రణకు ఆ మురికివాడ ఒక ఆదర్శం ..


జనసాంద్రతతో ఎప్పుడు కిక్కిరిసి ఉండే ముంబైలోని మురికివాడలో వైరస్ వ్యాప్తి విజృంభించినప్పటికీ.. వ్యూహాత్మక చర్యలతో తిరిగి నియంత్రణ సాధించారని టెడ్రోస్‌ అన్నారు. 'టెస్టింగ్,ట్రేసింగ్,ఐసోలేటింగ్&ట్రీటింగ్'తో ఇది సాధ్యమైందన్నారు. ఇటలీ,స్పెయిన్,సౌత్ కొరియా దేశాల్లోనూ ఇదే రకమైన పద్దతిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్లు చెప్పారు. కాబట్టి వైరస్ విజృంభిస్తున్నప్పటికీ... ఇప్పటికీ దాని నియంత్రణ సాధ్యమేనని పేర్కొన్నారు.

వైరస్ నియంత్రణకు సరైన నాయకత్వం,ప్రజల భాగస్వామ్యం,సామూహిక మద్దతు అవసరం అన్నారు.వైరస్ నియంత్రణకు ధారావిని ఒక ఉదాహరణగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం చర్చనీయాంశమైంది. కేవలం 2.1 చదరపు కి.మీ పరిధిలో 10లక్షల పైచిలుకు జనాభా ఉండే ఈ ప్రాంతంలో మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) తగిన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది.

Tags :
|
|

Advertisement