Advertisement

  • గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది ..నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన డ‌బ్ల్యూహెచ్ఓ

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది ..నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన డ‌బ్ల్యూహెచ్ఓ

By: Sankar Fri, 10 July 2020 3:25 PM

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది ..నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన డ‌బ్ల్యూహెచ్ఓ



గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాయగా.. వారి వాదనను డబ్ల్యూహెచ్ఓ పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాపిస్తోంద‌న్న వాద‌న‌లను గ‌త కొంత‌కాలంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చుతోంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రోగులను వెంటిలేషన్‌‌పై ఉంచే సందర్భాల్లో మాత్ర‌మే వైర‌స్ అలా వ్యాపిస్తోందని వాదిస్తోంది. తాజాగా దాన్ని పున‌:ప‌రిశీలించిన అనంత‌రం వైర‌స్ కొన్ని ప్రాంతాల్లో గాలిలో వ్యాపించే ఆస్కారం ఉన్నట్లు డ‌బ్ల్యూహెచ్ఓ స్ప‌ష్టం చేసింది.

అయితే, దీనిపై విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ.. తాజాగా సవరించిన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే గాలి ద్వారా కరోనా వ్యాప్తి సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృంద‌గానం చేసే ప్ర‌దేశాలు, జిమ్ములు నిర్వ‌హించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది.

ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఇండోర్ ప్ర‌దేశాలు, ఎక్కువ వెంటిలేష‌న్ లేని ప్రాంతాల్లో వైర‌స్ బారినపడ్డ వారి నుంచి ఇది మ‌రింత మందికి వ్యాపించే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని తెలిపింది. వీటితోపాటు వైర‌స్ సోకిన వ్య‌క్తులు తిరిగిన ప్రాంతాలు లేదా బహిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు స‌న్నిహితంగా మెల‌గ‌డం వ‌ల్ల‌ వైర‌స్ వ్యాప్తిచెందే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని పేర్కొంది.

Tags :
|
|
|
|

Advertisement