Advertisement

  • ఇండియాలో కరోనా కేసులు రోజూ పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO

ఇండియాలో కరోనా కేసులు రోజూ పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO

By: chandrasekar Tue, 11 Aug 2020 6:06 PM

ఇండియాలో కరోనా కేసులు రోజూ పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO


తాజా బ్రీఫింగ్‌లో WHO కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ని తరిమికొట్టగలమనే ఆశలు చిగురిస్తున్నాయని తెలిపింది. కానీ కరోనా ప్రపంచ మహమ్మారిగా మారేందుకు ఎక్కువ టైమ్ పట్టలేదన్న విషయాన్ని అన్ని దేశాలూ గుర్తుంచుకోవాలని తెలిపింది. ముఖ్యంగా ఇండియాలో కరోనా కేసులు బాగా పెరిగిపోతుండటంపై WHO తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. గత 7 రోజులుగా అమెరికా, బ్రెజిల్‌లో కంటే ఇండియాలోనే రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అంది. సమస్యేంటంటే ఆ రెండు దేశాల్లో కరోనా తగ్గట్లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇండియా చేరింది. ఫలితంగా ప్రపంచంలో 2 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు ఉంటే కోటికి పైగా పాజిటివ్ కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. ఈ మాట WHO అనలేదు.

కంగారుపడటం ద్వారా కరోనా పోదనీ ఆ వైరస్ పోవడానికి ప్రజలు, ప్రపంచ దేశాలూ క్రమశిక్షణతో మెలగాలని చెప్పింది. అలా చేస్తే కచ్చితంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆపగలమని అంది. ఇప్పటికే ఉన్న మందులు, పద్ధతుల ద్వారా కరోనా వైరస్‌కి అనుకున్నదాని కంటే బాగానే బ్రేక్ వేశామని వివరించింది. మన దగ్గర కచ్చితమైన పవర్‌ఫుల్ పోలియో వ్యాక్సిన్ ఉంది, కచ్చితమైన ప్రభావవంతమైన తట్టు వ్యాక్సిన్ ఉంది. కానీ ఇప్పటికీ మనం ఆ వ్యాధులను పూర్తిగా పోగొట్టేందుకు కష్టపడాల్సి వస్తోందన్న WHO కరోనాకి సరైన వ్యాక్సిన్ రావడం ద్వారా పూర్తిగా వైరస్ పోతుందని అనుకోలేమని తెలిపింది. కరోనా వైరస్‌కి ఇచ్చే వ్యాక్సిన్ ద్వారా ఇతర కరోనా తరహా వైరస్‌లకూ చెక్ పడుతుందా అన్న ప్రశ్నకు ఇప్పటికైతే పూర్తి ఆన్సర్ లేదని WHO తెలిపింది. ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయని వివరించింది. వాతావరణ మార్పుల ద్వారా కరోనా వైరస్ పోదనీ ఎండ, వాన, చలి ఎలాంటి వాతావరణంలోనైనా ఈ వైరస్ జీవిస్తోందని WHO స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement