Advertisement

  • డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి...

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి...

By: chandrasekar Mon, 02 Nov 2020 7:05 PM

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి...


సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకు అందరూ కరోనావైరస్ ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు టెడ్రోస్ అధనమ్ సోమవారం ఉదయం ట్విట్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నానని.. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండి ఇంటి నుంచే పనిచేస్తానని ఆయన చెప్పారు.

ఈ మేరకు టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ట్విట్ చేస్తూ ... ‘‘నా డబ్ల్యూహెచ్ఓ సహచరుల భాగస్వామ్యంతో వారికి ఏమాత్రం హాని కలిగించకుండా వారి ప్రాణాలకు కాపాడతాను. కష్టమైనప్పటికీ మనమంతా ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలి. ఇలా చేయడం ద్వారా కరోనా సామాజిక వ్యాప్తిని అరికట్టి.. ఆరోగ్య వ్యవస్థలను కాపాడవచ్చు. నేను కరోనా పాజిటివ్ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు గుర్తించాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను’’.. అంటూ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ట్విట్ చేశారు.

Tags :
|
|
|

Advertisement