Advertisement

  • సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

By: Sankar Mon, 02 Nov 2020 08:03 AM

సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్


ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం గెబ్రెయెసస్ తనంతట తానుగా ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో కరోనా వచ్చిన దగ్గర నుంచి డబ్ల్యూహెచ్ఓ దానిపై మాట్లాడూతూనే ఉంది.

అంతేకాకుండా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఏ దేశాన్ని నిందించకూడదంటూ అన్ని దేశాల మధ్య సామరస్యతను కాపాడేప్రయత్నం చేసింది. అయితే ఇటీవల దాని డైరెక్టర్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. వివరాల్లోకి వెలితే.. అతడు కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిశాడని, తాను కూడా జాగ్రత్తలు తీసుకుంటూన్నాని, తనకైతే ఎటువంటి లక్షణాలు లేవని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రం హోమ్ చేయనున్నట్లు చెప్పారు. మిగిలిర డబ్ల్యూహెచ్ఓ ఉద్యోగులు వారి కర్తవ్యాలను నిర్వహిస్తారని తెలిపారు.

Tags :
|
|

Advertisement