Advertisement

  • కరోనా టెస్టుల్లో మొదటి స్థానం మాదే ..మా తర్వాత ఇండియానే ..వైట్ హౌస్

కరోనా టెస్టుల్లో మొదటి స్థానం మాదే ..మా తర్వాత ఇండియానే ..వైట్ హౌస్

By: Sankar Fri, 17 July 2020 12:27 PM

కరోనా టెస్టుల్లో మొదటి స్థానం మాదే ..మా తర్వాత ఇండియానే ..వైట్ హౌస్



ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర దశలో ఉంది ..ముఖ్యంగా అమెరికా , బ్రెజిల్ , ఇండియా , రష్యా వంటి దేశాలు ఈ కరోనా మహమ్మారి దాటికి కుదేలవుతున్నాయి ..అయితే కరోనా టెస్టుల విషయంలో కూడా అమెరికా , భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి అని అమెరికన్ వైట్ హౌస్ వెల్లడించింది ..

కరోనా టెస్టుల విషయంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌​ తమ తర్వాత స్థానంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో అమెరికాలో 42మిలియన్ల టెస్టులు చేసి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. 12 మిలియన్ల టెస్టులతో భారత్‌ రెండవ స్థానంలో ఉంది’ అన్నారు. టెస్టుల విషయంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే.. ఇది ఎంతో మెరుగ్గా ఉందని కైలీ తెలిపారు..

ఇక వ్యాక్సిన్‌ అభివృద్ధి గురించి కైలీ మాట్లాడుతూ.. మోడరనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మంచి సంకేతాలను చూపిస్తున్నారన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 45 మందిలో సానుకూల, తటస్థ రోగనిరోధక ప్రతిస్పందనను చూపిస్తున్నారని తెలిపారు. కోలుకున్న రోగులతో దీన్ని పోల్చి చూస్తే ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. ‘ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్‌ ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో.. చివరకు అదే లభిస్తుంది అన్నారు. ముఖ్యంగా మోడరనా వ్యాక్సిన్ జూలై చివరి నాటికి మూడవ దశకు చేరుకుంటుంది’ అని కైలీ తెలిపారు. దీనిలో 30,000 మంది పాల్గొంటారన్నారు..

Tags :
|

Advertisement