Advertisement

వైట్ హౌస్ లో విషంతో కూడిన పార్సెల్ కలకలం..

By: Sankar Sun, 20 Sept 2020 12:06 PM

వైట్ హౌస్ లో విషంతో కూడిన పార్సెల్ కలకలం..


అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ బిజీగా ఉన్నవేళ.. వైట్‌హౌస్‌లో కలకలం రేగింది. ట్రంప్ పేరుతో విషంతో కూడిన ఓ పార్శిల్ వచ్చింది. పార్శిల్‌పై పంపిన వ్యక్తి వివరాలేవీ లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు అందులో ఏముందో తెలుసుకునేందుకు దాన్ని తెరిచి చూశారు.

దీంతో అది విషంతో కూడి ఉన్నట్టుగా గుర్తించారు. టెస్టుల్లో ఆ పార్శిల్లో ఉన్న పదార్థం రిసిన్ అనే పాయిజన్ అని తేలింది. పార్శిల్ పంపిన వ్యక్తి వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫెడరల్ ఇన్విస్టిగేటివ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌బీఐ), సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాయి.

గతంలో కూడా వైట్‌హౌస్‌కు విషంతో కూడిన పార్శిల్స్ వచ్చాయి. 2018లో ఎక్స్ నేవీ ఆఫీసర్ ఒకరు రిసిన్‌తో కూడిన లెటర్‌ను ట్రంప్‌నకు పంపారు. ముందుగానే అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement