Advertisement

మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తో వాట్సాప్

By: chandrasekar Mon, 15 June 2020 2:30 PM

మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తో వాట్సాప్


దేశంలో ఎక్కువగా వాడబడుతున్న మెసెంజర్ అప్ వాట్సాప్. ఈ యాప్ కొత్త ఫీచర్‌తో మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ తీసుకొస్తున్నది. ప్రస్తుతం మల్టీ డివైజ్ లాగిన్లపై టెస్టింగ్ మొదలుపెట్టామని వాట్సాప్ తెలిపింది. సెర్చింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. చాట్ క్లియర్ వంటి మరెన్నో ఫీచర్లతో అప్డేట్స్ తీసుకురానున్నది. ఇప్పటివరకూ ఒకే అకౌంట్ ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే డెస్క్‌టాప్ వెబ్ వెర్షన్ లాగిన్ అయిన డివైజ్ నుంచి యాక్సెస్ చేసుకొంటున్నారంతే. త్వరలో రానున్న ఫీచర్ ద్వారా ఒకే అకౌంట్‌తో మల్టీ డివైజుల్లో లాగిన్ కావొచ్చు. ప్రస్తుతం వాట్సాప్ ఏదైనా ఒక అకౌంట్ ఒక డివైజ్‌లో లాగిన్ అయితే అందులో మాత్రమే ఆ అకౌంట్ యాక్సెస్ చేసుకొనే అవకాశం ఉన్నది. మరో డివైజ్‌లో కూడా అదే అకౌంట్‌తో లాగిన్ అవ్వాలంటే మాత్రం ముందుగా లాగిన్ అయిన డివైజ్ నుంచి లాగౌట్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మరో కొత్త డివైజ్ లోకి లాగిన్ అనుమతి ఉంటుంది.

కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ లో అలాంటి ఇబ్బంది ఉండదు. సులభంగా ఒకే అకౌంట్ ఒకే సమయంలో వేర్వేరు డివైజ్‌ల్లోకి లాగిన్ కావొచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 4 డివైజుల్లో ఒకే వాట్సాప్ అకౌంట్‌తో లాగినయ్యే పరిమితి ఉంటుందని పేర్కొన్నది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇతర ఫీచర్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. వీటిలో లేటెస్ట్ బీటా అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. లేటెస్ట్ బీటా iOS, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరిన్ని ఫీచర్లను టెస్టింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. దీనివల్ల వేరువేరు ఫోన్లలో ఒకే అకౌంట్ ని వాడుకోడానికి వీలవుతుంది.

Tags :
|

Advertisement