Advertisement

  • కొన్ని ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లలో జనవరి 1 నుండి వాట్సాప్ పని చేయదు

కొన్ని ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లలో జనవరి 1 నుండి వాట్సాప్ పని చేయదు

By: chandrasekar Fri, 18 Dec 2020 11:06 AM

కొన్ని ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లలో జనవరి 1 నుండి వాట్సాప్ పని చేయదు


మెరుగైన సేవ మరియు భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వర్షన్లలో వాట్సాప్ పని చేయకుండా నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 మరియు దాని కంటే తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఉన్నట్లయితే అందులో పనిచేయవు. అలాగే ఐఫోన్ ఐఓఎస్ 9 వర్షన్ కంటే తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఉన్నట్లయితే అందులో పని చేయదు.

ఇందుకోసం ఐఫోన్లో ఐఓఎస్ ను మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వర్షన్ ను అప్ గ్రేడ్ చేసుకోవలసి ఉంటుంది. మన ఫోన్లో ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఉందో తెలుసుకోవడానికి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే సెట్టింగ్ లోకి వెళ్లి జనరల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే సెట్టింగ్ లోకి వెళ్లి మీరు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి అప్పుడు మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం వివరాలు తెలుసుకోవచ్చు.

మీ పాత ఫోన్ లలో ఆపరేటింగ్ సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నట్లయితే మీరు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు లేకుంటే ఇందులో వాట్సాప్ జనవరి నుండి పని చేయదు. ప్రస్తుతం దేశంలో వాట్సాప్ ను ఉపయోగించని వారు ఎవరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ తన మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వాట్సాప్ లో అన్ని రకాల డేటాను షేర్ చేసుకోవడం తో పాటు ప్రస్తుతం పేమెంట్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ విషయాన్ని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గమనించి ఆపరేటింగ్ సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాలి లేదంటే కొత్త ఫోన్ కు మారాల్సి ఉంటుంది.

Tags :

Advertisement