Advertisement

కొత్తగా 138 ఎమోజీలను తీసుకువచ్చిన వాట్సాప్

By: chandrasekar Mon, 03 Aug 2020 09:56 AM

కొత్తగా 138 ఎమోజీలను తీసుకువచ్చిన వాట్సాప్


ప్రముఖ సోషల్ మీడియా అప్ వాట్సాప్‌ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్‌ తీసుకువస్తోంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.20.197.6 బీటాలోని తాజా మార్పులలో కొత్తగా 138 ఎమోజీలను తీసుకువచ్చేందుకు పరీక్షిస్తోంది. ఎమోజీలు భావాలను, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఎమోజీలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. వాట్సాప్ తాజా అప్‌డేట్‌లలో 138 కొత్త ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను విడుదల చేసిన కొద్ది రోజులకే వీటిని కూడా జోడించింది.

తరచు షేరింగ్ కు వాడే వాట్సాప్‌ అప్ లో సాధారణ స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కొత్త ఎమోజీలు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. మొదటిసారి చూసినప్పుడు తేడాను గమనించలేకపోవచ్చు. వీటిలో కొత్త రంగు టోన్లు, బట్టలు, కేశాలంకరణ, స్కిన్ టోన్లలో మార్పులు కూడా ఉన్నాయి. వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూఏ బేటా ఇన్ఫో ఆండ్రాయిడ్‌ వాట్సాప్ వెర్షన్ 2.20.197.6 బీటాలో సరికొత్త ఎమోజీల విడుదలను తెలిపింది. అయితే మీరు గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లోని తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా కొత్త మార్పులు చేసుకోవచ్చు.

ఈ అప్‌డేట్స్ కోసం దీనికి ప్రత్నామ్నాయంగా ఏపీకే ఫైల్‌ను మిర్రర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్ వాట్సాప్ జూలైలో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు యానిమేటెడ్ స్టిక్కర్లను తీసుకువచ్చింది. ప్రారంభ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ల జాబితాలో రికోస్ స్వీట్ లైఫ్, ప్లేఫుల్ పియోమారు, బ్రైట్ డేస్, మూడీ ఫుడీస్, చమ్మీ చుమ్ చుమ్స్ ఉన్నాయి. ఈ ఎమోజీలు ఎంతవరకు నెటిజన్లను ఆకర్షిస్తుదో వేచి చూడాలిమరి.

Tags :
|
|
|

Advertisement