Advertisement

  • భారత బలగాలకు పట్టుబడిన చైనా సైనికుడి వద్ద ఏమున్నాయంటే

భారత బలగాలకు పట్టుబడిన చైనా సైనికుడి వద్ద ఏమున్నాయంటే

By: chandrasekar Sat, 24 Oct 2020 09:45 AM

భారత బలగాలకు పట్టుబడిన చైనా సైనికుడి వద్ద ఏమున్నాయంటే


భారత్ మరియు చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. ఇటీవల డెమ్‌చోక్ ప్రాంతంలో భారత బలగాలకు పట్టుబడిన చైనా సైనికుడి వద్ద ఓ స్లీపింగ్ బ్యాగ్, స్టోరేజి పరికరం, ఓ మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. తూర్పు లద్దాక్‌లోని భారత భూభాగమైన డెమ్‌చుక్‌లో వాస్తవాధీన రేఖ వద్ద సోమవారం కార్పొరల్ వాంగ్ యా లోంగ్ అనే చైనా సైనికుడు తప్పిపోయి భారత సైనికులకు పట్టుబడ్డాడు.

దారితప్పి భారత భూభాగంలోకి వచ్చిన అతడి వద్ద ఓ స్లీపింగ్ బ్యాగ్, ఖాళీగా ఉన్న డేటా స్టోరేజ్ డివైజ్, మొబైల్ ఫోన్ ఉన్నాయి. పట్టుబడిన సమయంలో అతడి వద్ద మిలటరీ ఐడీ కార్డు కూడా ఉంది అని అధికారులు వెల్లడించారు. చుషుల్ మీటింగ్ హట్ వద్ద జరిగిన సరిహద్దు భద్రతా దళాల సమావేశం తర్వాత అతడిని చైనాకు అప్పగించారు.

అంతకు ముందు ప్రొటోకాల్ ప్రకారం చైనా సైనికుడిని భారత ఆర్మీ అధికారులు అణువణువూ తనిఖీ చేసి, విచారణ జరిపారు. కాగా అతడికి ఇక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఆక్సిజన్, ఆహారంతో పాటు వెచ్చదనాన్ని కల్పించే దుస్తులను కూడా ఇచ్చినట్టు ఆర్మీ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Advertisement