Advertisement

తాను చెసేదే కరెక్ట్ అంటున్న ట్రంప్

By: chandrasekar Thu, 21 May 2020 2:11 PM

తాను చెసేదే కరెక్ట్ అంటున్న ట్రంప్


కరోనా వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను తీసుకుంటున్నట్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఇటీవల ట్రంప్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికి ట్రంప్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ అదనపు భద్రతను ఇస్తుందని తాజాగా మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రోత్సహిస్తున్నందుకే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు చెడ్డపేరు వస్తోందని అన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల ఉపయోగం గురించి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీ చేసినా, తాను రోజుకు ఒక మాత్ర చొప్పున వారం రోజులుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటున్నానని ట్రంప్ ఇటీవల చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా వైద్యుల సలహా తీసుకోకుండా అమెరికన్లు హైడ్రాక్సీక్లోరిక్విన్‌ను వాడుతారంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

trump,hydroxychloroquine,tablets,america,india ,ట్రంప్, కరోనా వైరస్, హైడ్రాక్సీక్లోరోక్విన్, డ్రగ్‌, భద్రత


భారత్ నుంచి అధిక సంఖ్యలో హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను సైతం అమెరికాకు తెప్పించుకున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కరోనా నయమవుతుందని కొద్ది కాలం క్రితం ట్రంప్ చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యల కారణంగా అనేక దేశాల్లో చాలా మంది ప్రజలు వైద్యులను సంప్రదించకుండానే హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుని అనారోగ్యానికి గురయ్యారు. ఇదిలా ఉంటే.. హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రయోగం విఫలమైందని అమెరికాలోని ఓ స్టడీ ఇటీవల చెప్పింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ప్రయోగించిన వారిలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయని.. అనేక మంది మరణించినట్టు కూడా తెలిపింది. దీన్ని కూడా ట్రంప్ కొట్టిపడేశారు. వయసు పైబడిన వారిపై, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రయోగం చేసి హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల ఉపయోగం లేదని స్టడీ చెప్పిందని.. అదంతా తప్పని అన్నారు.

Tags :
|

Advertisement