Advertisement

  • పారిజాత మొక్క ప్రత్యేకతలు ఏమిటి ఎందుకు అయోధ్య భూమిపూజలో ప్రధాని దానిని నాటారు

పారిజాత మొక్క ప్రత్యేకతలు ఏమిటి ఎందుకు అయోధ్య భూమిపూజలో ప్రధాని దానిని నాటారు

By: chandrasekar Wed, 05 Aug 2020 4:06 PM

పారిజాత మొక్క ప్రత్యేకతలు ఏమిటి ఎందుకు అయోధ్య భూమిపూజలో ప్రధాని దానిని నాటారు


పారిజాత మొక్క ప్రత్యేకతలు ఏమిటి ఎందుకు అయోధ్య భూమిపూజలో ప్రధాని దానిని నాటారు అని చాలామంది కలిగే సందేహం. అయోధ్య భూమిపూజలో పాల్గొనే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిజాత మొక్కను ఆలయ స్థల ఆవరణలో నాటారు. ప్రపంచంలో ఎన్నో మొక్కలు ఉండగా పారిజాత మొక్కనే మోదీ ఎందుకు నాటారన్నది ఆసక్తికర అంశం.

తాళపత్ర గ్రంథాల్లో, పురాణాల్లో పారిజాత వృక్షం పవిత్రమైన, ప్రత్యేకమైన వృక్షంగా భావించేవారు. ఆ చెట్టు పూలు సువాసన వెదజల్లుతాయి. ఆ చెట్టుకి ఔషధ గుణాలు కూడా ఎక్కువే. చాలా రకాల వ్యాధుల్ని ఆ చెట్టు నయం చేస్తుందని చెబుతారు. ఇష్టదైవాలకు పూజలు చేసేటప్పుడు పారిజాత పూలను వాడుతారు. చాలా మంది కవులు పారిజాతాన్ని తమ కవితలు, పద్యాల్లో ప్రస్తుతించారు. దీన్ని ప్రజక్త, షెఫాలికా, షెఫాలీ, షియులీ అని కూడా పిలుస్తారు. ఉర్దూలో దీన్ని గుల్జాఫరీ అంటారు. అందమైన పారిజాత వృక్షం నుంచి పూల సువాసనలు చుట్టుపక్కల అంతటా వ్యాపిస్తాయి.

ఈ చెట్టు ఆకులు, బెరడును కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. భారత దేశం అంతటా ఈ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టును ముట్టుకుంటే చాలట అలసట తీరిపోతుందని చాలా మంది చెబుతుంటారు. పారిజాత వృక్షం 10-15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొన్ని చోట్ల 30 అడుగులు కూడా ఉంటుంది. ఈ చెట్టుకు పూలు చాలా ఎక్కువగా పూస్తాయి. అందువల్ల ఇది ఎక్కడ ఉంటే అక్కడ గార్డెన్ మొత్తం పూలతో ఆకర్షణీయంగా మారుతుంది.

specialties of parijata plant,prime minister,planted,ayodhya,bhumi puja ,పారిజాత మొక్క, ప్రత్యేకతలు, అయోధ్య, భూమిపూజ, ప్రధాని దానిని నాటారు


హిమాలయాలు, మధ్య భారత్‌లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో కూడా పారిజాతం ప్రస్థావన ఉంటోంది. పురాణాల్లోని హరివంశపురంలో ఈ చెట్టు గురించి ఉంది. ఈ చెట్టును ముట్టుకోగానే నర్తకి ఊర్వశి అలసట పోయింది. ఓసారి నారదముని ఈ చెట్టు నుంచి పూలు తీసుకొని ఇంద్రలోకం లోని శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు.

కృష్ణుడు కొన్ని పూలను తన సతీమణి రుక్మిణీ దేవికి ఇచ్చారు. నారదుడు ఈ విషయాన్ని కృష్ణుడి మరో భార్య సత్యభామకు చెప్పారు. ఇంద్రలోకం లోని దైవ పుష్పాలను ఇచ్చారని చెప్పారు. సత్యభామకు కోపం వచ్చింది. తనకు ఓ పారిజాత చెట్టు కావాలని శ్రీకృష్ణుణ్ని కోరింది. త్వరలోనే తెచ్చి ఇస్తానని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణాల్లో ఉంది. ఇంద్ర లోకానికి వెళ్లిన నారదుడు ఈ పూల చెట్టును ఇంద్రలోకం నుంచి వేరే ఎవరికీ ఇవ్వకూడదని అన్నాడు. కానీ శ్రీకృష్ణుడు బలవంతం చేయడంతో ఇంద్రుడు ఓ చెట్టును ఇచ్చాడు. ఓ శాపం కూడా పెట్టాడు. ఈ చెట్టు పూలు పగటివేళ విచ్చుకోకూడదనీ, రాత్రి వేళ మాత్రమే పుష్పించాలని తెలిపాడు. చాల ప్రత్యేకతలు కలిగిన ఈ మొక్కా చాలా ప్రత్యేకమైనది మరియు దాదాపు అన్ని ఆలయాలలో చూడవచ్చు.

పారిజాత మొక్కలోని ఔషధ గుణాల వల్ల పైల్స్ సమస్య తీరుతుందని అంటున్నారు. గుండెకు కూడా ఈ పూలు మేలు చేస్తాయంటున్నారు. ఈ పూలను గ్రైండ్ చేసి ఆ గుజ్జులో తేనె కలిపి తాగితే పొడి దగ్గు తగ్గుతుంది. గుజ్జుగా చేసిన పారిజాత పూలను చర్మంపై రాసుకుంటే చర్మ రోగాలు నయమవుతాయి. పారిజాతపూలతో హెర్బల్ ఆయిల్ కూడా తయారుచేస్తారు. దాన్ని చర్మ రోగాలకు వాడుతారు. పారిజాత ఆకుల రసం జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన పారిజాత చెట్టుని మోడీ మూందుగా నాటి తరువాత భూమి పూజ చేసారు.

Tags :

Advertisement