Advertisement

  • వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వైన్ బ్రావో టీ20 క్రికెట్లో 500 వికెట్లు

వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వైన్ బ్రావో టీ20 క్రికెట్లో 500 వికెట్లు

By: chandrasekar Thu, 27 Aug 2020 7:34 PM

వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వైన్ బ్రావో టీ20 క్రికెట్లో 500 వికెట్లు


వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో టీ20 క్రికెట్‌లో అధిక వికెట్లు తీయడంద్వారా చరిత్ర లిఖించాడు. పొట్టి ఫార్మాట్‌లో 500వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ఆడుతున్న బ్రావో సెయింట్‌ లూసియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్‌ను ఔట్‌ చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ చేసే ఇతను అధిక వికెట్లను పడగొట్టాడు.

వివిధ లీగ్‌లతో సహా వెస్టిండీస్‌ తో కలిపి మొత్తం ఇప్పటి వరకు 23 జట్ల తరఫున బ్రావో 459 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో బ్రావో తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ అత్యధికంగా 390వికెట్లు తీసాడు. బ్రావో మినహా మిగిలిన ఎవరూ ఇంతవరకు 400వికెట్ల మార్కును సైతం చేరుకోలేకపోయారు. అలాగే టీ20ల్లో 300, 400వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ బ్రావోనే రికార్డులలో నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇతను చాల విజయాలకు నంది పలికాడు.

Tags :

Advertisement