Advertisement

  • ఇంగ్లాండ్ పర్యటనకు వెస్ట్ ఇండీస్ జట్టు ప్రకటన ...కరోనా కారణంగా ముగ్గురు దూరం

ఇంగ్లాండ్ పర్యటనకు వెస్ట్ ఇండీస్ జట్టు ప్రకటన ...కరోనా కారణంగా ముగ్గురు దూరం

By: Sankar Thu, 04 June 2020 09:36 AM

ఇంగ్లాండ్ పర్యటనకు వెస్ట్ ఇండీస్ జట్టు ప్రకటన ...కరోనా కారణంగా ముగ్గురు దూరం

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలు ఒకదాని తర్వాత ఒకటి మొదలు అవుతున్నాయి ..క్రికెట్ మ్యాచ్ లు ఆగిపోయి రెండు నెలలు దాటిపోయింది దీనితో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ..కరోనా ప్రభావం తగ్గన్నపటికి కొన్ని దేశాలకు క్రికెట్ ఆడేందుకు ముందుకు వచ్చాయి ..తాజాగా ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ కు రెండు దేశాలు అంగీకరించాయి ..దీనిలో భాగంగా జులై 8 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ కోసం వెస్ట్ ఇండీస్ జట్టును ప్రకటించింది..అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంగ్లాండ్‌లో పర్యటించేందుకు ఓ ముగ్గురు వెస్టిండీస్ క్రికెటర్లు నిరాకరించారు. పర్యటనకి దూరంగా ఉన్న క్రికెటర్లు సిమ్రాన్ హిట్‌మెయర్, కీమో పాల్, డారెన్ బ్రావో.

ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపికయిన జట్టు :జేసన్ హోల్డర్ (కెప్టెన్), కార్లోస్ బ్రాత్‌వైట్, బ్రూక్స్, కాంపెబెల్, రోస్టన్ ఛేజ్, కార్న్‌వాల్, డార్విచ్ (వికెట్ కీపర్), బ్లాక్‌వుడ్, బోనర్, కీమర్ హోల్డర్, షై హోప్, జోసెఫ్, రైఫెర్, కీమర్ రోచ్

west indies,england,corona,test,daren bravo ,ఇంగ్లాండ్‌, వెస్ట్ ఇండీస్, క్రికెట్ , జేసన్ హోల్డర్ ,  కరోనా వైరస్

జులై 8 నుంచి 12 వరకూ హోంప్‌షైర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. జులై 16 నుంచి 20 మధ్య రెండో టెస్టు, 24 నుంచి 28 వరకూ మూడో టెస్టు మ్యాచ్‌ మాంచెస్టర్ వేదికగా జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో.. అక్కడికి చేరుకున్న తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లో వెస్టిండీస్ టీమ్ ఉండాల్సి ఉంటుంది. దాంతో.. సిరీస్ ఆరంభానికి నెల రోజుల ముందే టీమ్‌ అక్కడికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఇప్పటికే చైనాని దాటేసిన యూకే.. మూడు లక్షల కేసులకి చేరవలో ఉంది. దాంతో.. ఇప్పట్లో ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండవని అంతా ఊహించారు. కానీ.. జులై నుంచి.. అదీ అన్ని దేశాల కంటే ముందే ఆ దేశంలో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ప్రారంభంకాబోతున్నాయి.

Tags :
|
|

Advertisement