Advertisement

  • వచ్చే ఏడాది జూన్ లో బోర్డు పరీక్షలు నిర్వహించనున్న వెస్ట్ బెంగాల్...

వచ్చే ఏడాది జూన్ లో బోర్డు పరీక్షలు నిర్వహించనున్న వెస్ట్ బెంగాల్...

By: Sankar Wed, 23 Dec 2020 7:29 PM

వచ్చే ఏడాది జూన్ లో బోర్డు పరీక్షలు నిర్వహించనున్న వెస్ట్ బెంగాల్...


కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభమే కాలేదు ...దీనితో ఈ ఏడాది బోర్డు ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని అనుమానం ఉంది..అయితే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మాధ్యమిక్‌ (10 తరగతి), ఉచ్ఛా మాధ్యమిక్‌ (ఇంటర్‌) బోర్డు పరీక్షలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (డబ్ల్యూబీబీఎస్‌ఈ) 2021 జూన్‌లో ఒకదాని తరువాత మరొకటి నిర్వహించనుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ బుధవారం తెలిపారు. త్వరలో బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో 2020 విద్యాసంవత్సరంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపాలని ఇటీవలే ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు పునః ప్రారంభ తేదీలపైనా బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటనేది చేయలేదు.

ఇదిలాఉండగా మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులతో సమావేశమై సీబీఎస్‌ఈ పరీక్షలను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు..

Tags :
|

Advertisement