Advertisement

  • తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించిన వెస్ట్ బెంగాల్ ....

తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించిన వెస్ట్ బెంగాల్ ....

By: Sankar Wed, 23 Dec 2020 5:12 PM

తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించిన వెస్ట్ బెంగాల్ ....


వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి ఎలాగయినా అధికారం దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది ..ఇక మరోవైపు అధికారం కాపాడుకోవాలని మమతా బెనర్జీ అంతే స్థాయిలో ప్రయత్నిస్తుంది..

అందులో భాగంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి మమతా సర్కార్ సిద్ధం అయ్యింది. ముఖ్యంగా తెలుగువారిని ఆకట్టుకోవడానికి మమతా బెనర్జీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ సర్కార్ ఇప్పటికే అనేక భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు. ఇప్పుడు తెలుగు భాషను కూడా అధికారిక భాషగా గుర్తించడంతో తెలుగువారికి సముచిత గౌరవం ఇచ్చినట్టు అయ్యింది.

మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ బాష దిశగా అడుగులు వేయడం ఏంటని ప్రశ్నించింది.

Tags :
|

Advertisement