Advertisement

  • డేటింగ్‌ యాప్‌లతో లక్షలు వసూలు చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠా అరెస్టు...

డేటింగ్‌ యాప్‌లతో లక్షలు వసూలు చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠా అరెస్టు...

By: chandrasekar Sat, 21 Nov 2020 5:50 PM

డేటింగ్‌ యాప్‌లతో లక్షలు వసూలు చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠా అరెస్టు...


డేటింగ్‌ యాప్‌లతో మోసం చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠా సభ్యులను ముగ్గురిని నగరంలోని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డేటింగ్‌ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ముఠా రూ.13.8 లక్షలు వసూలు చేసింది. అదేవిధంగా షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి వద్ద రూ.లక్ష కాజేసింది.

సహజీవనానికి అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ ముఠా సభ్యులు డబ్బు వసూలు చేస్తున్నారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, 31 సెల్‌ఫోన్లు, 12 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సీపీ సజ్జనార్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంతూదాస్‌ అనే ప్రధాన నిందితుడు 35 టెలీకాలర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. డేటింగ్‌ అప్లికేషన్లను సంప్రదించొద్దన్నారు. ఎవరూ కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. డేటింగ్‌ మోసాలపై 94906 17444 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement