Advertisement

  • బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై పోరాడాలని చెప్పిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై పోరాడాలని చెప్పిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

By: chandrasekar Fri, 13 Nov 2020 10:30 AM

బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై పోరాడాలని చెప్పిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ


బీహార్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఎన్డీయేకు అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని చెప్పిన తేజస్వి యాదవ్. బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై పోరాడాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సూచించారు. గురువారం ఆమె ఫోన్‌లో తేజస్వీతో మాట్లాడారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అతను ఓడిపోవడం వెనుక కుట్ర జరిగిందని, ఆయనను బలవంతంగా ఓడించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ రాష్ట్రంలో మహాకూటమి గెలుస్తుందని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా దీనికి వ్యతిరేకంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ తీరుపై పోరాటం కొనసాగించాలని తేజస్వికి మమత సూచించారు. మరోవైపు అసెంబ్లీలో మహాకూటమి నేతగా తేజస్వి యాదవ్‌ను కూటమిలోని పార్టీలు గురువారం ఎన్నుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మోసపూరితంగా గెలిచిందని అవి ఆరోపించాయి.

ఓట్లు కౌంటింగ్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరిచారు. కౌంటింగ్ నేపథ్యంలో ఈసీ అనుసరించాల్సిన నిబంధనలను ఈ సందర్భంగా తేజస్వి యాదవ్‌ చదివి వినిపించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎన్డీయేకు అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ప్రజలు మహాకూటమికి మొగ్గు చూపగా, ఈసీ ఎన్డీయే పక్షాన నిలిచిందని, అందుకే కౌంటింగ్‌ ప్రక్రియను మెల్లగా జరిపిందని విమర్శించారు. బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని తేజస్వి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా అప్పుడే తమ నియోజకవర్గాలకు తిరిగి వెళ్లవద్దని, ఒక నెల రోజులు పాట్నాలోనే ఉండాలని చెప్పారు. హెచ్‌ఏఎం, వీఐపీలకు ఎన్డీయేలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో గమనించి ఆ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తామని తేజస్వి తెలిపారు. ఇలా ఎన్డీయే పై పలు ఆరోపణలు చేసారు.

Tags :

Advertisement