Advertisement

బాగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

By: chandrasekar Fri, 26 June 2020 7:22 PM

బాగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు


స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలను బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కుంగదీశాయి. జూన్‌ నెలకుగాను డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగియనుండటంతో మదుపరులు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గుచూపారు.

30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 561.45 పాయింట్లు (1.58 శాతం) పడిపోయి 34,868.98 వద్ద నిలువగా, నిఫ్టీ 165.70 పాయింట్లు క్షీణించి 10,305.30 వద్ద నిలిచింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ రంగ షేర్లు 7 శాతానికి పైగా నష్టపోయాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 7.43 శాతం నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ 7.35 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 5.76 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.30 శాతం, ఎస్బీఐ 4.08 శాతం, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 3.57 శాతం, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.17 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకులు నష్టపోయాయి. కానీ, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, టీసీఎస్‌లు నాలుగు శాతం వరకు ఎక్కువైయ్యాయి.

కరోనా వైరస్‌ నేపథ్యంలో కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక ఫలితాల గడువును మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరోమారు పెంచింది. స్టాక్‌ మార్కెట్లో లిైస్టెన సంస్థలు క్యూ4 ఆర్థిక ఫలితాలతోపాటు గతేడాది మొత్తానికి సంబంధించిన ఫలితాలను వచ్చే నెల చివరివరకు ప్రకటించుకోవచ్చని సెబీ ప్రకటించింది.

Tags :
|
|
|

Advertisement