Advertisement

తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

By: Sankar Sun, 16 Aug 2020 4:10 PM

తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు


తెలంగాణాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు మరొక మూడు రోజులు కొనసాగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది.

దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు.

ఈ రోజు అనేక చోట్ల మరియు రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి..హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది..దీనితో నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది..దీనితో అధికారులు ౨౪ గంటల పాటు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు

Tags :

Advertisement