Advertisement

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు...!

By: Anji Fri, 06 Nov 2020 10:02 PM

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు...!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. దంచికొట్టిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోంది.

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

దీంతో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా మండలం శుక్రవారం ఉదయం 10.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు ఒకే స్థాయిలో ఉన్నాయి.

హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రత తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ విభాగం అంచనా వేసింది.

Tags :

Advertisement