Advertisement

  • పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ..ఆ దేశ ప్రధాని సంచలన నిర్ణయం

పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ..ఆ దేశ ప్రధాని సంచలన నిర్ణయం

By: Sankar Wed, 19 Aug 2020 11:33 AM

పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ..ఆ దేశ ప్రధాని సంచలన నిర్ణయం


కరోనా వాక్సిన్ మహమ్మారి ఒకవైపు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరోవైపు వాక్సిన్ ప్రయోగాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. ఆక్స్‌ఫర్డ్- ఫార్మ దిగ్గజం ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. తాజాగా, వ్యాక్సిన్ ఉత్పత్తి, తయారీ కోసం ఆస్ట్రాజెనికాతో ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మంగళవారం వెల్లడించారు..

వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒప్పందంపై సంతకం చేసినట్టు ఆయన తెలిపారు. స్వీడిస్‌- బ్రిటిష్‌ ఫార్మా కంపెనీ అయిన ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ విజయవంతమైతే తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ఆస్ట్రేలియాలో 2.5 కోట్ల మంది పౌరులందరికీ ఉచితంగా అందజేస్తామని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మూడో దశ ట్రయిల్స్‌లో ఉన్న ఐదు వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఒకటి. మూడో దశ ట్రయల్స్‌ సమర్థంగా కొనసాగుతున్న ఈ వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరికల్లా వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు..

Tags :
|
|
|
|

Advertisement