Advertisement

  • మర్డర్ సినిమా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు ..వర్మ

మర్డర్ సినిమా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు ..వర్మ

By: Sankar Fri, 18 Dec 2020 3:59 PM

మర్డర్ సినిమా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు ..వర్మ


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్ ...తెలంగాణాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ , అమృత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే..అయితే వర్మ మాత్రం ఈ విషయాన్ని ఖండించాడు...ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నామని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు.

ఈ మర్డర్ సినిమాను ఆపివేయాలని అమృత కోర్టులో కేసు వేసిన… ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను ఈ నెల 22న మిర్యాలగూడలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రణయ ఆత్మహత్య చేసుకున్న పట్టణంలోనే ఆర్జీవీ ప్రెస్ మీట్ పెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మిర్యాలగూడలో కూడా ‘మర్డర్’ సినిమా రిలీజ్ చేస్తామన్నాడు వర్మ. థియేటర్ ధ్వంసం చేసిన వెనక్కి తగ్గమన్నాడు, రిలీజ్ చేసుకోమని కోర్ట్ ఆర్డర్ ఉంది, రిలీజ్ కి సహకరించమని పోలీస్ ఉన్నతాధికారులను కలుస్తామని వర్మ తెలిపాడు. కాగా, ఇప్పటికే మర్డర్ సినిమా ఫస్ట్ ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ ట్రైలర్ కూడా విడుదలైంది

Tags :
|

Advertisement