Advertisement

  • రహానేపై తొలిరోజు నుంచే ఒత్తిడి పెంచుకుంటూ వెళ్తాము ..జస్టిన్ లాంగర్

రహానేపై తొలిరోజు నుంచే ఒత్తిడి పెంచుకుంటూ వెళ్తాము ..జస్టిన్ లాంగర్

By: Sankar Thu, 24 Dec 2020 10:17 PM

రహానేపై తొలిరోజు నుంచే ఒత్తిడి పెంచుకుంటూ వెళ్తాము ..జస్టిన్ లాంగర్


చెత్త ప్రదరర్శన కారణంగా ప్రత్యర్థి జట్టు ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకోగలనని, అయితే వారి కోచ్‌ స్థానంలో మాత్రం తనను ఊహించుకోలేనని ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాపై ఒత్తిడి ఉందని, అది తమ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. క్రిస్‌మస్‌ వీకెండ్‌ను తాము సంతోషంగా గడుపుతామని చెప్పుకొచ్చాడు.

ఇక కోహ్లి, షమీ గైర్హాజరీ తమకు లాభిస్తుందన్న లాంగర్‌.. తదుపరి మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. ‘‘ఏ ఆటలోనైనా స్టార్లు లేకుంటే ప్రత్యర్థి జట్టుకు ఉపయోగకరమే కదా. విరాట్‌ కోహ్లి గొప్ప ఆటగాడు. షమీ కూడా మంచి ప్లేయర్‌. వాళ్లు లేకపోవడం మాకు సానుకూలాంశమే. ఇక రెండో టెస్టులో మొదటి రోజు నుంచే రహానే(తాత్కాలిక కెప్టెన్‌)పై ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు..

ఇక టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు అని అడుగగా.. ‘‘అసలు ఆ విషయంతో నాకు సంబంధం లేదు. ఇప్పటికే నాకున్న ఒత్తిళ్లు చాలు. అయితే వారి బాధను నేను సహానుభూతి చెందగలను. ఇక ఇప్పుడు టీమిండియాపై ఒత్తిడి ఉందనేది వాస్తవం’’ అని పేర్కొన్నాడు

Tags :
|
|

Advertisement