Advertisement

  • ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ను అందిస్తాం: రష్యా ప్రధాన మంత్రి

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ను అందిస్తాం: రష్యా ప్రధాన మంత్రి

By: chandrasekar Fri, 24 July 2020 12:47 PM

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ను అందిస్తాం: రష్యా ప్రధాన మంత్రి


రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్తిన్ ప్రపంచ దేశాలకు తాము కరోనా వ్యాక్సిన్‌ ను అందిస్తామని పేర్కొన్నారు. తమ దేశంలో అత్యుత్తమ కరోనా టీకాలు ఉత్పత్తి అవుతున్నాయని రష్యా పార్లమెంట్ దిగువ సభలో తెలిపారు.

ప్రపంచ దేశాలన్నీ కరోనా (Covid19 Vaccine) వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. తమ దేశంలో కరోనా టీకా (Corona Vaccine) తయారీలో ముందంజలో ఉందని రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ బుధవారం పేర్కొన్నారు.

రష్యా పార్లమెంట్ దిగువ సభలో కరోనా అంశంపై ఆయన మాట్లాడారు. వారి దేశంలో 17 ప్రముఖ సంస్థలు కరోనా వ్యాక్సిన్ పనుల్లో బిజీగా ఉన్నాయని, మొత్తంగా 26 రకాల కోవిడ్19 టీకాలు రూపొందిస్తున్నాయని తెలిపారు. నాలుగు రకాల వ్యాక్సిన్‌ల ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, వీటి వల్ల ఏ హాని లేదని అధికారిక సంస్థలు తేలినట్లు పేర్కొన్నారు.

ఇందులో రెండు టీకాలు (Russia Covid19 Vaccine) చివరి దశ ప్రయోగాలలో ఉన్నాయని రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ వివరించారు. మరో రెండు టీకాలు త్వరలోనే చివరి దశ ప్రయోగాలు చేపట్టనున్నారని చెప్పారు.

రష్యాలోని సంస్థలు తయారుచేస్తున్న కోవిడ్19 వ్యాక్సిన్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే రష్యా త్వరలోనే ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించనుందని తమ కరోనా టీకాలకు ఇతర దేశాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Advertisement