Advertisement

  • సిడ్నీ టెస్టులో మెరుగ్గా రాణిస్తాము ...పాట్ కమ్మిన్స్

సిడ్నీ టెస్టులో మెరుగ్గా రాణిస్తాము ...పాట్ కమ్మిన్స్

By: Sankar Wed, 30 Dec 2020 3:47 PM

సిడ్నీ టెస్టులో మెరుగ్గా రాణిస్తాము ...పాట్ కమ్మిన్స్


మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తుచేసి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే...తొలి టెస్ట్ లో దారుణం ఓటమి చవి చుసిన టీమిండియా ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకొని ఆస్ట్రేలియాను అన్ని రంగాలలో మట్టికరిపించింది...అయితే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా బాట్స్మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు..ముఖ్యంగా ఐసీసీ ర్యంకింగ్స్ లో నెంబర్ స్థానంలో ఉన్న స్మిత్ అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేసాడు...

అయితే ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, తమ బ్యాట్స్‌మెన్‌ తిరిగి ఫాంలోకి వస్తారనే నమ్మకం ఉందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సిడ్నీ టెస్టులో మెరుగ్గా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఏడాది క్రితం తమ బ్యాటర్లు పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లను మట్టికరిపించారని, అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.

పేలవ బ్యాటింగ్‌తో చతికిలపడి.. ఓ చెత్త రికార్డును నమోదు చేశారు. స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం

Tags :
|

Advertisement