Advertisement

  • కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుల వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేస్తాం: హ‌రీష్ రావు

కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుల వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేస్తాం: హ‌రీష్ రావు

By: chandrasekar Wed, 28 Oct 2020 9:49 PM

కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుల వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేస్తాం: హ‌రీష్ రావు


రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెచ్చిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా త్వ‌ర‌లోనే ఉద్య‌మం చేస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుల వ‌ల్ల రైతుల‌కు తీర‌ని న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేప‌థ్యంలో చేగుంట‌లో టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తుగా రైతులు ర్యాలీ నిర్వ‌హించారు. దీంతో రైత‌న్న‌ల‌తో చేగుంట నిండిపోయింది. టీఆర్ఎస్‌కే త‌మ మ‌ద్ద‌తు, ఓటు అంటూ రైతులు నిన‌దించారు. ఈ ర్యాలీలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న అగ్రికల్చ‌ర్ బిల్లుల‌ను కేంద్రం తెచ్చింది. స‌బ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాల‌ని మే 17న కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసింది. బావుల వ‌ద్ద మీట‌ర్లు పెడితే రూ. 2500 కోట్లు ఇస్తామ‌న్నారు. బావుల ద‌గ్గ‌ర మీట‌ర్లు పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని జూన్ 2న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశార‌ని హ‌రీష్ రావు గుర్తు చేశారు. రైతుల‌ను మోసం చేస్తున్న బీజేపీని 300 మీట‌ర్ల లోతులో పాతిపెట్టాల‌ని సూచించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో పంట‌లు ఎండిపోయేవి. ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు రూ. 30 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఇచ్చేవార‌ని గుర్తు చేశారు. ఎవ‌రీ ప్ర‌యోజ‌నాల కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ని చేస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌కు కార్య‌క‌ర్త‌లు లేక ప‌క్క మండ‌లాలు, జిల్లాల నుంచి తీసుకువ‌స్తున్నార‌ని పేర్కొన్నారు. తిన్న‌ది అర‌గ‌క రైతులు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని చంద్ర‌బాబు ప‌ద‌వీ కాలంలో బీజేపీ నాయ‌కులు అన్నార‌ని మంత్రి గుర్తు చేశారు. వ్య‌వ‌సాయం దండ‌గా కేంద్రమంత్రిగా ఉన్న‌ప్పుడు బండారు ద‌త్తాత్రేయ వ్యాఖ్యానించార‌ని చెప్పారు. కాలిపోయే మోటార్లు కావాలా? ‌బావుల వ‌ద్ద మీట‌ర్లు కావాలా? నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్ కావాలో నిర్ణ‌యించుకోవాల్సిందే రైతులే అని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.

Tags :
|

Advertisement