Advertisement

  • రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము ..ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్

రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము ..ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్

By: Sankar Wed, 04 Nov 2020 5:05 PM

రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము ..ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్


భవాని ఐల్యాండ్‌ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు.

బోటింగ్‌కు ఇప్పటికే అనుమతినిచ్చామని, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అనుమతి వస్తుందన్నారు. పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్‌కు అనుమతినిచ్చామని చెప్పారు. బోటింగ్‌ జరిగే చోట కమాండ్‌ కంట్రోల్‌ రూం పని చేస్తుందని చెప్పారు..

అంతే కాకుండా గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు..కాగా ఇంతకుముందు భవాని ఐల్యాండ్‌ లో బోట్ బోల్తా పడి అనేక మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే...

Tags :
|
|

Advertisement