Advertisement

  • ఎక్కువ బిల్లు వస్తే వచ్చే నెలలో అడ్జెస్ట్ చేస్తం

ఎక్కువ బిల్లు వస్తే వచ్చే నెలలో అడ్జెస్ట్ చేస్తం

By: chandrasekar Mon, 08 June 2020 7:24 PM

ఎక్కువ బిల్లు వస్తే వచ్చే నెలలో అడ్జెస్ట్ చేస్తం

కరెంట్ బిల్లులు పెంచలేదని, టారిఫ్ ప్రకారమే వసూలు చేస్తున్నామని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ఏటా వేసవిలో విద్యుత్ వినియోగం 13శాతం పెరుగుతుందని, దాంతో స్లాబ్ లు మారి బిల్లు పెరుగుతుందని వివరించారు. పోయినేడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో కరెంట్ ఎక్కువ వాడారని, లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే ఉండడంతో వినియోగం పెరిగిందన్నారు.

శనివారం హైదరాబాద్ లోని కార్యాలయంలో రఘుమారెడ్డి మీడియాతో మాట్లాడారు. బిల్లు ఎక్కువ వచ్చిందంటూ తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలించి వివరణ ఇచ్చామన్నారు. ఈ నెలలో ఎవరికైనా ఎక్కువ బిల్లు వస్తే వచ్చే నెలలో అడ్జెస్ట్ చేస్తామని రఘుమారెడ్డి తెలిపారు. డొమెస్టిక్ లో 9 స్లాబ్ లు, 3 కేటగిరీలు ఉంటాయని చెప్పారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 95 లక్షల మంది వినియోగదారులు ఉండగా, వారిలో 75లక్షల మంది డొమెస్టిక్ వినియోగదారులేనని వెల్లడించారు. వీరిలో 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించేవారే 80శాతం ఉన్నారన్నారు.

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ తీసుకునే బిల్లులు ఇచ్చామని రఘుమారెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా తప్పుడు బిల్లులు ఇవ్వలేదని చెప్పారు. మార్చిలో 67శాతం, ఏప్రిల్ లో 44 శాతం, మేలో 68 శాతం మంది మాత్రమే బిల్లు కట్టారని వెల్లడించారు. మొత్తం యావరేజ్ గా 60 శాతం మంది మాత్రమే బిల్లులు చెల్లించారన్నారు. మిగతా వాళ్లు కట్టకపోవడంతోనే బిల్లులు ఎక్కువగా వచ్చాయన్నారు. అందరూ బిల్లులు కట్టాలని తాము విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. మార్చి, ఏప్రిల్, మేలో ఎవరెంత కరెంట్ వాడారనేది తమ దగ్గర లేదని చెప్పారు.

లాక్ డౌన్ తో రీడింగ్ తియ్యలేదని, అందుకే మూడు నెలల యావరేజ్ బిల్లు ఇచ్చామని స్పష్టం చేశారు. రీడింగ్ తీసేటోళ్లు పని చేయకపోయినా, గత మూడు నెలలకు 50 శాతం జీతం ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించామని రఘుమారెడ్డి తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement