Advertisement

  • దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాను...మంత్రి హరీష్ రావు

దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాను...మంత్రి హరీష్ రావు

By: Sankar Tue, 10 Nov 2020 5:56 PM

దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాను...మంత్రి హరీష్ రావు


దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. మా లోపాలను సవరించుకుంటాం. దుబ్బాక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

ఓడిపోయిప్పటికి దుబ్బాక ప్రజలకు టీఆర్‌ఎస్‌ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో తోడుగా ఉంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు, కార్యకర్తలకు, అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తూ టీఆర్‌ఎస్‌ ఎప్పుడు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

కాగా రౌండ్ రౌండ్కు ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం చివరకు బిజెపి వైపుకు మొగ్గింది..బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప మెజారిటీ తో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత మీద విజయం సాధించారు..ఇక కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక మూడో స్థానానికి పడిపోయిది..

Tags :

Advertisement