Advertisement

  • వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్

By: Sankar Thu, 10 Dec 2020 6:45 PM

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్


తెలంగాణ ప్రభుత్వం ఏంటో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పథకం ధరణి ..రిజిస్ట్రేషన్లు సులభతరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం దీనిని తెచ్చినట్లు తెలిపింది కానీ అది హై కోర్ట్ లో పడటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది ..అయితే వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను గతంలో మాదిరే కంప్యూటర్ ఆధారిత విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అభ్యంతరం లేదన్న ధర్మాసనం తేల్చి చెప్పింది.

గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సీఏఆర్‌డీ పద్దతి కొనసాగించాలని పిటిషన్‌ తరపు న్యాయవాదులు కోరగా.. ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడలని అడ్వొకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్‌కు ప్రోపర్టీట్యాక్స్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని వాదించారు.

Tags :

Advertisement