Advertisement

  • రహానే కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉంది ..కెప్టెన్ కోహ్లీ

రహానే కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉంది ..కెప్టెన్ కోహ్లీ

By: Sankar Wed, 16 Dec 2020 8:03 PM

రహానే కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉంది ..కెప్టెన్ కోహ్లీ


టీమిండియా ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది ..అయితే ఈ సిరీస్ లో తొలి టెస్ట్ ఆడిన తర్వాత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి పయనం కానున్నాడు ..కోహ్లీ భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనిస్తుండటంతో కోహ్లీ ఇండియా కు వస్తున్నాడు ..దీనితో రహానే తర్వాత జరిగే మూడు టెస్టులకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు...

రహానే గతంలో రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (2017) మరియు ఆఫ్ఘనిస్తాన్ (2018) కు వ్యతిరేకంగా భారత జట్టుకు నాయకత్వం వహించి వాటిలో విజయం సాధించాడు. కానీ ఆ రెండు మ్యాచ్ లు భారత్ వేదికగా జరిగాయి. దాంతో రహానే విదేశీ పర్యటనల్లో జట్టుకు నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి.

అయితే ఈ విషయం పై కోహ్లీ మాట్లాడుతూ... రహానే పై నాకు పూర్తి నమ్మకం ఉంది. రహానే నేను చాలా సంవత్సరాలుగా కలిసి ఆడుతున్నాము. మేము బ్యాటింగ్ లో గొప్ప భాగసౌమ్యలు నెలకొల్పాము . రహానే ఆసీస్ తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లలో అద్భుతమైన కెప్టెన్సీ చేసాడు. ఇది తనను తాను నిరూపించుకోవడానికి రహానేకు గొప్ప అవకాశం అని కోహ్లీ పేర్కొన్నాడు.

Tags :
|
|
|

Advertisement