Advertisement

  • ఇన్‌స్టంట్‌ లోన్లపై ఫిర్యాదులు వచ్చాయి ...సైబరాబాద్ సీపీ సజ్జనార్

ఇన్‌స్టంట్‌ లోన్లపై ఫిర్యాదులు వచ్చాయి ...సైబరాబాద్ సీపీ సజ్జనార్

By: Sankar Tue, 22 Dec 2020 5:08 PM

ఇన్‌స్టంట్‌ లోన్లపై ఫిర్యాదులు వచ్చాయి ...సైబరాబాద్ సీపీ సజ్జనార్


గత వారం రోజులుగా తెలంగాణాలో ఇన్స్టంట్ లోన్ ఇచ్చే యాప్ ల ఆగడాల మీద పోలీసులు ద్రుష్టి సారించారు..గత వారం వ్యవధిలోనే ఇంస్టాన్ట్ లోన్ ఆప్ ల ద్వారా మనీ తీసుకున్న ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో వాటి ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు..తాజాగా వాటిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడారు..

ఇన్‌స్టంట్‌ లోన్లపై ఫిర్యాదులు వచ్చాయని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. క్యాష్ మామా, లోన్‌ జోన్‌, ధనాధన్‌ పేర్లతో లోన్‌లు ఇస్తున్నారని, ఇన్‌స్టంట్‌ లోన్లు వ్యవహారాన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాయదుర్గంలో రెండు కంపెనీలను గుర్తించామని, రెండు కంపెనీల్లో 110 మందికి పైగా టెలీకాలర్స్‌ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఆరుగురు కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, 22 ఫోన్లు, 18 బ్యాంక్ అకౌంట్లలో 1.52 కోట్లు సీజ్‌ చేసినట్లు సీపీ వెల్లడించారు..ప్రజలు ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా లోన్లు ఇచ్చే యాప్ లను నమ్మి మోసపోవద్దు అని సజ్జనార్ సూచించారు...

Tags :
|
|

Advertisement