Advertisement

  • సారథిగా ద్రవిడ్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు ..గంభీర్

సారథిగా ద్రవిడ్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు ..గంభీర్

By: Sankar Mon, 22 June 2020 5:10 PM

సారథిగా ద్రవిడ్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు ..గంభీర్



ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు అంటే అందరూ చెప్పే సమాధానాలు కపిల్ దేవ్ , ధోని , గంగూలీ అనే ..అయితే కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు..అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా ద్రవిడ్‌ తనదైన ముద్ర వేసిన విషయాన్ని గంభీర్‌ గుర్తు చేశాడు. కానీ ద్రవిడ్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ చాలా తక్కువ అన్నాడు.

మనం ఎ‍ప్పుడూ సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనిలా గురించి మాత్రమే మాట్లాడుతున్నామని, ద్రవిడ్‌ సేవల్ని విస్మరించారన్నాడు. జట్టు కోసం ఏమీ చేయడానికైనా ద్రవిడ్‌ సిద్ధంగా ఉండేవాడనే విషయాన్ని గంభీర్‌ ప్రస్తావించాడు. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఎన్నో విజయాల్ని అందించాడన్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ తరహాలోనే ద్రవిడ్‌ అత్యున్నత ఆటగాడన్నాడు.

కాకపోతే సచిన్‌ నీడలో ద్రవిడ్‌ ప్రతిభ వెలుగులోకి రాలేదనే విషయం వాస్తవమన్నాడు. ఓవరాల్‌గా చూస్తే ద్రవిడ్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ‘ నా వన్డే అరంగేట్రం సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో జరగ్గా, నా టెస్టు అరంగేట్రం ద్రవిడ్‌ సారథ్యంలో జరిగింది. ద్రవిడ్‌ జట్టుకు చేసిన సేవలు అమోఘం. గంగూలీ విజయవంతమైన సారథి అయినా ద్రవిడ్‌కు తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు.

ద్రవిడ్‌ సారథిగా కూడా గొప్ప విజయాల్నే చూశాడు. ఓపెనర్‌గా, కీపర్‌గా ఇలా బహుముఖ పాత్రలో ద్రవిడ్‌ అలరించాడు. కానీ తగిన గుర్తింపు రాలేదు. సచిన్‌ నీడలో ఆడటం కూడా ద్రవిడ్‌కు గుర్తింపు రాకపోవడానికి ఒక కారణం. కానీ సచిన్‌ తరహా క్రికెటర్‌ ద్రవిడ్‌. ఇక గంగూలీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపిన కెప్టెన్‌. కానీ భారత క్రికెట్‌లో ఓవరాల్‌గా రాహుల్‌ ద్రవిడే ప్రభావంతమైన కెప్టెన్‌’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ల్లో ద్రవిడ్‌ కెప్టెన్సీలో విజయాలే అతని సారథ్యానికి అద్దం పడతాయన్నాడు.

Tags :
|
|
|

Advertisement