Advertisement

  • ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మేము సిద్ధంగా ఉన్నాము ..మంత్రి బొత్స సత్యనారాయణ

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మేము సిద్ధంగా ఉన్నాము ..మంత్రి బొత్స సత్యనారాయణ

By: Sankar Wed, 28 Oct 2020 10:54 PM

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మేము సిద్ధంగా ఉన్నాము ..మంత్రి బొత్స సత్యనారాయణ


స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంద‌ని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ర్టంలో కోవిడ్ తీవ్ర‌త ఉండ‌టంతో ఎన్నిక‌ల విష‌మ‌మై ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంద‌న్నారు. రాష్ర్టంలో క‌రోనా కేసులు లేని స‌మ‌యంలో ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని ఇప్పుడు కోవిడ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపారు.

14వ ఆర్థిక సంఘం నిధుల కోసం అప్పుడు ఎన్నికలు జరగాలని వైఎస్సార్‌సీపీ కోరింది. అయిన‌ప్ప‌టికీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి టీడీపీ నాయ‌కుల‌ను క‌లిసిన ద‌శ‌లో ఎలా న‌మ్ముతామంటూ ప్ర‌శ్నించారు. ఓ వ్యక్తి నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు వెనక్కి వెళ్లాయి. దీనిపై ఎవరు మాట్లాడరెందుకు అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

కాగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో సీఎస్‌ సాహ్ని ఆయనతో భేటీ అయి ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె తెలిపారు.

Tags :
|
|

Advertisement