Advertisement

  • జో బిడెన్ ను అమెరికా అధ్యక్షుడిగా గుర్తించలేము ...పుతిన్ సంచలన వ్యాఖ్యలు

జో బిడెన్ ను అమెరికా అధ్యక్షుడిగా గుర్తించలేము ...పుతిన్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Mon, 23 Nov 2020 11:36 PM

జో బిడెన్ ను అమెరికా అధ్యక్షుడిగా గుర్తించలేము ...పుతిన్ సంచలన వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు.

కానీ, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును మాత్రం తాము గుర్తించేందుకు సిద్ధంగా లేనని పుతిన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా మేము కలిసి పనిచేస్తాం. అయితే, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాతే ఆ గౌరవం ఉంటుందనిరష్యన్‌ అధికారిక మీడియాలో పుతిన్‌ వెల్లడించారు.

బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని.. వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు బదులుగా.. ‘దెబ్బతినడానికి ఏమీ లేవు, అవి ఇప్పటికే పూర్తిగా క్షీణించిపోయాయి’ అని పుతిన్‌ సమాధానమిచ్చారు.

Tags :
|

Advertisement